Prime Minister: భారత క్రీడాకారుల విజయం యువతకు స్ఫూర్తి!: ప్రధాని మోదీ ప్రశంసలు

  • వారి ప్రతిభ దేశానికి గర్వకారణం
  • యువ క్రీడాకారులకు స్ఫూర్తినీయం
  • శారీరక సామర్థ్యం ఎంత ముఖ్యమో తెలిసేలా చేస్తుందంటూ ట్వీట్
కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారుల  ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రశంసించారు. భారత క్రీడాకారులు 218 మంది ఈ క్రీడల్లో పాల్గొనగా ఏకంగా 66 పతకాలను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇందులో 26 బంగారు పతకాలు కూడా ఉన్నాయి. భారత్ కు కామన్వెల్త్ గేమ్స్ లో ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

దీంతో భారత క్రీడాకారుల ప్రతిభను ప్రధాని ట్విట్టర్ ద్వారా మెచ్చుకున్నారు. వారి సాహసోపేత ప్రదర్శన భారత దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత క్రీడాకారుల విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో అందరిలోనూ అవగాహన ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున శారీరక సామర్థ్యం పెంపు విషయంలో సాధ్యమైన కృషి చేస్తామని ప్రధాని చెప్పారు.
Prime Minister
Narendra Modi
Twitter

More Telugu News