హైదరాబాద్ లో భారీ బందోబస్తు... ఎక్కడ చూసినా పోలీసులే!

షార్ట్స్‌లో చూడండి
మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు నిందితులకు అనుకూలంగా రావడంతో, హైదరాబాద్ చుట్టుపక్కల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కూడళ్లలో ముఖ్యంగా పాతబస్తీ పరిసరాల్లో పొద్దుటి నుంచి 2 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు శాఖ, తీర్పు తరువాత మరిన్ని దళాలను రంగంలోకి దించింది.

ఈ కేసులో సాక్ష్యాలు లేవంటూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. దీంతో పాతబస్తీలో అల్లర్లు జరగవచ్చన్న ఆందోళన నెలకొనగా, పలు చౌరస్తాల్లో మోహరించిన పోలీసులు, అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ఐదుగురు నిందితులు ఎన్ఐఏ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో తీర్పు అనుకూలంగా రావడం పట్ల వారంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Makka Maszid
NIA Court
Judgement
Police
Hyderabad

More Telugu News