Asaduddin Owaisi: గుజరాత్, యూపీలో ఎంఐఎం పోటీ చేయలేదు... మరి కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు?: అసదుద్దీన్ ప్రశ్న

  • బీజేపీ గెలుపునకు తోడ్పడుతున్నామనడం ఆధార రహితం
  • కర్ణాటకలో పోటీ చేయడం లేదు
  • జేడీఎస్ కు మా మద్దతు
ఎంఐఎం పోటీ చేయడం ద్వారా ఓట్లను చీల్చి బీజేపీ విజయానికి బాటలు వేస్తోందంటూ తమ పార్టీపై వచ్చిన ఆరోపణలను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఈ ఆరోపణలు ఆధారరహితమని పేర్కొన్నారు. ‘‘గుజరాత్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో మేం పోటీ చేయలేదు. అలాగే, యూపీ, మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల్లోనూ పాల్గొనలేదు. అక్కడ కాంగ్రెస్ కు ఏమైంది? ఎందుకు గెలవలేదు?’’ అని అడిగారు.

కర్ణాటకలో వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లోనూ తాము పోటీ చేయడం లేదని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. జేడీఎస్ కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని, ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఒవైసీ పేర్కొన్నారు.
Asaduddin Owaisi
mim

More Telugu News