balakrishna: 'ఎన్టీఆర్' మూవీలో జయలలిత పాత్ర .. స్పందించిన కాజల్!

  • 'ఎన్టీఆర్' మూవీకి సన్నాహాలు
  • బసవతారకం పాత్రకి గాను విద్యాబాలన్?
  • జయలలిత పాత్ర గురించి కాజల్            
తేజ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' మూవీ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేయనుండగా, బసవతారకం పాత్రకిగాను విద్యాబాలన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో జయలలిత పాత్ర కూడా ఉంటుందనీ, ఆ పాత్రను కాజల్ చేయనుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

 ఈ ప్రచారం కాజల్ వరకూ వెళ్లడంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. "ఈ సినిమా కోసం ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు .. ఈ సినిమాలో నేను నటించడం లేదు. ఇదంతా కేవలం పుకారు మాత్రమే .. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు" అంటూ ఆమె స్పష్టం చేసింది. జయలలిత .. ఎన్టీఆర్ తో కలిసి కొన్ని హిట్ చిత్రాల్లో నటించారు. అలాంటి జయలలిత పాత్ర ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.     
balakrishna
teja

More Telugu News