Pawan Kalyan: కేసీఆర్ ను పవన్ కల్యాణ్ ఎందుకు పొగడుతున్నారంటే..!: జనసేన ప్రతినిధి శ్రీధర్ వివరణ

  • తెలంగాణలో పాలన బాగుందని పవన్ భావించారు
  • ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా పవన్ పాలిటిక్స్
  • కక్షసాధింపు రాజకీయాలు చేయబోరన్న శ్రీధర్
తెలంగాణలో పరిపాలన బాగుందని భావించారు కాబట్టే తమ పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్, కేసీఆర్ ను పొగిడారని జనసేన ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా పవన్ రాజకీయం సాగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య కక్షసాధింపు రాజకీయాలు జరిగాయని గుర్తు చేసిన ఆయన, పవన్ ఎన్నడూ అటువంటి రాజకీయాలు చేయబోరని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడి కంటే, తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని పవన్ నమ్ముతున్నారని చెప్పారు. అందువల్లే కేసీఆర్ కు 6 పాయింట్లు, చంద్రబాబుకు 2 పాయింట్లను ఆయన ఇచ్చారని తెలిపారు. తమ నేత పవన్ ను కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయే రాజకీయ నేతగా వ్యాఖ్యానిస్తున్నారని, వారికి నిజమేంటో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.
Pawan Kalyan
Addepalli Sridhar
Jana Sena
KCR
Chandrababu

More Telugu News