Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రుతి

  • పవన్ కల్యాణ్ కి ప్యాకేజీ ఇస్తే చాలు
  • 200 కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నాడు
  • మసాజ్ కి బెంగాలీ అమ్మాయిలు కావాలి
‘తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడి’ అనే అంశంపై హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చ నిర్వహించారు. మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో పలువురు సినీ ఆర్టిస్టులు తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తారు.

ఈ క్రమంలో సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రుతి మాట్లాడుతూ, పవన్‌ కల్యాణ్‌ కు ప్యాకేజీ ఇస్తే చాలని ఆమె విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అమరావతిలో 200 కోట్ల రూపాయలతో ఇల్లు కడుతున్నాడని ఆమె తెలిపారు. ఆయనకు మసాజ్‌ చేసేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలి కానీ, మహిళా సమస్యలు పరిష్కరించాలని వెళ్తే మాత్రం తమను పట్టించుకోలేదని ఆమె వెల్లడించారు.

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. దీనికి సినీ పెద్దలు ఒక వేదిక ఏర్పాటు చేసి, పరిశ్రమలో జరుగుతున్న లైంగిక, ఆర్థిక దోపిడీపై ఓపెన్‌ డిబేట్‌ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 30 సర్జరీలు చేస్తే కానీ హీరోలు కాలేని వారు సినీ పరిశ్రమలో రాజ్యమేలుతున్నారని ఆమె ఎధ్దేవా చేశారు.
Pawan Kalyan
sruti
character artist

More Telugu News