modi: మోదీ భజన ఇక చెల్లదు .. ఆయన ఒక చెల్లని నాణెం: డొక్కా మాణిక్య వరప్రసాద్

  • ఏపీ బీజేపీ నేతలు ఐదు కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేస్తున్నారు
  • కేంద్రానికి రాష్ట్ర బీజేపీ నేతలు కొమ్ముకాస్తున్నారు
  • ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఎలా ఇచ్చారు?
ఏపీ బీజేపీ నేతలు ఐదు కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేస్తున్నారని, మోదీ భజన ఇక చెల్లదని, ఆయన ఒక చెల్లని నాణెమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి రాష్ట్ర బీజేపీ నేతలు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేకహోదా ఏపీకి ఇవ్వమని చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గుజరాత్ లో రూ.లక్ష కోట్లతో ఒక పట్టణాన్ని నిర్మిస్తున్న కేంద్రం, ఏపీపై మాత్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని, బీజేపీ విడుదల చేసిన లేఖలో తెలిపినవన్నీ అసత్యాలేనని అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్ లాంటి ప్రధానిని, కించపరిచేలా బీజేపీ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
modi
dokka manikya prasad

More Telugu News