Telugudesam: విష్ణుకుమార్ రాజు! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు: బుద్దా వెంకన్న వార్నింగ్

  • స్థాయిని మరిచి విష్ణుకుమార్ రాజు, మాధవ్ మాట్లాడుతున్నారు
  • ఏపీలో బీజేపీకి పట్టుమని పది ఓట్లు కూడా లేవు
  • ప్రజల్లోకి వెళ్లే దమ్ము బీజేపీ నేతలకు ఉందా?
  • ఒకవేళ వెళితే చెప్పులతో కొడతారు
భారతీయ జనతా పార్టీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. బీజేపీని ‘బబుల్ గమ్ జనతా పార్టీ’గా అభివర్ణించారు. తమ స్థాయిని మరిచి బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే బాగుండదని హెచ్చరించారు.

ఏపీలో బీజేపీకి పట్టుమని పది ఓట్లు కూడా లేవని, చంద్రబాబు పెట్టిన భిక్షతో ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారని అన్నారు. ప్రజల్లోకి వెళ్లే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? ప్రజల్లోకి వెళితే చెప్పులతో కొడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాపీ కొట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ అని బుద్దా వెంకన్న విమర్శించారు.
Telugudesam
vishnu kumra raju
bjp
buddha venkanna

More Telugu News