Tollywood: అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం : నటి అపూర్వ

  • న్యాయం  జరిగే వరకు పోరాడతాం
  • ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే  అవహేళన చేస్తున్నారు
  • అనవసర వ్యాఖ్యలు చేయొద్దు
నటి శ్రీరెడ్డికి మొదటి నుంచి మద్దతుగా ఉన్న మరోనటి అపూర్వ. ‘సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్’ అంశంపై  హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా అపూర్వ మాట్లాడుతూ, న్యాయం  జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే, ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తామని హెచ్చరించింది.

ఉన్నది ఉన్నట్టుగా తాము మాట్లాడుతుంటే, కొందరు తమను అవహేళన చేస్తున్నారని, తమకు మద్దతుగా నిలవకపోయినా ఫర్వలేదుగానీ, అనవసర వ్యాఖ్యలు చేయొద్దని కోరింది. కాగా, సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక హింసను కూడా ఆమె ప్రస్తావించింది.
Tollywood
apoorva

More Telugu News