Pawan Kalyan: ఈ స్ఫూర్తితో మరిన్ని ఉత్తమ చిత్రాలు రావాలి!: పవన్ కల్యాణ్

  • జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఆ సినిమాలకు అవార్డులు 
  • ఆనందంగా ఉందన్న పవన్
  • ఈ స్ఫూర్తితో మరిన్ని ఉత్తమ చిత్రాలు రావాలని ఆకాంక్ష
నిన్న ప్రకటించిన 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బాహుబలి-2, ఘాజీ చిత్రాలు అవార్డులు కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2 ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్ర పురస్కారంతోపాటు మరో రెండు అవార్డులు దక్కించుకోవడం.. యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఘాజీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవడం సంతోషం కలిగించిందని చెప్పారు. బాహుబలి హీరో ప్రభాస్... బాహుబలి, ఘాజీ చిత్రాల్లో నటించిన రానా దగ్గుబాటి.. రెండు చిత్రాల దర్శక, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకీ అభినందనలు తెలిపారు. ఈ స్ఫూర్తితో తెలుగు చిత్రసీమ నుంచి మరిన్ని ఉత్తమ చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan
Jana Sena
Prabhas

More Telugu News