Jagan: చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తారట.. ఏ రోజు చేస్తున్నారో తెలుసా?: జగన్ చురకలు

  • చంద్రబాబు పుట్టినరోజు ఏప్రిల్ 20
  • ఏప్రిల్‌ అంటే నాలుగో నెల.. 20వ తేదీన చేస్తారట
  • అంటే ఆయన 420 మనిషి
  • కొంగ జపం చేస్తారు 
రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20న నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజు తన పుట్టినరోజు కావడంతో చంద్రబాబు ఆ రోజేనే దీక్ష చేయనున్నారు. చంద్రబాబు చేస్తున్న దీక్షపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి... "ఆయన పుట్టిన రోజున దీక్ష చేస్తారట. ఆయన పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? ఏప్రిల్ 20 అట. ఏప్రిల్ అంటే 4.. 20వ రోజున చేస్తారట.. అంటే 420.. ఆ ఏప్రిల్‌ 20న ఆయన కొంగ జపం చేస్తారట.

ఆయన నిరాహార దీక్ష చేస్తారట. ఎంపీలతో రాజీనామా చేయించకపోగా ఇటువంటి పనులు చేస్తున్నారు. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామాలు చేయించి, ఆమరణ దీక్షకు దిగి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది. అవి చేయకుండా ఏప్రిల్ 20న, ఈ 420 మనిషి దీక్ష చేస్తారట" అని జగన్ చురకలంటించారు. కాగా, చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా అనే అంశాన్ని దగ్గరుండి నీరుగార్చారని జగన్ అన్నారు. 
Jagan
Chandrababu
YSRCP
Vijayawada

More Telugu News