K Kavitha: కథువా, ఉన్నావో ఘటనలు తీవ్రంగా బాధించాయి: ఎంపీ కవిత

  • దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
  • మహిళలు, చిన్నారులపై దాడులు జరగడం బాధాకరం
  • నిందితులను కాపాడే విధంగా వ్యవహరించారు
జమ్ముకశ్మీర్‌లోని కతువా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో జరిగిన దారుణ ఘటనలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ దాడులపై అన్ని రంగాల వారు స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలపై స్పందించి.. మహిళలు, చిన్నారులపై ఇటువంటి దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులను కాపాడే విధంగా వ్యవహరించడం పట్ల ఒక మహిళగా తనకు చాలా బాధనిపించిందని ఆమె వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కవిత డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులపై దాడులు జరగడం బాధాకరమని, చాలా అమానుషమని, దారుణమైన ఈ ఘటనలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె వ్యాఖ్యానించారు.  
K Kavitha
Telangana
katua

More Telugu News