Chandrababu: చంద్రబాబుకు చీర, గాజులు పంపిన వైసీపీ

  • ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా వైసీపీ కార్యక్రమం
  • ర్యాలీ నిర్వహించి, పోస్టు బాక్సులో వేసిన మహిళా నాయకులు 
  • చంద్రబాబుది చేతకానితనమన్న నాయకురాళ్లు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు, పసుపు, కుంకుమను వైసీపీ మహిళా విభాగం పంపింది. అనంతపురం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని టవర్ క్లాక్ నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి... చీర, గాజులు, పసుపు, కుంకుమను పోస్ట్ బాక్సులో వేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైసీపీనే అని అన్నారు. చంద్రబాబు చేతకానితనంతో రాష్ట్రానికి హోదా రాకుండా ఉందని... అందుకే వీటన్నింటినీ ఆయనకు పంపిస్తున్నామని చెప్పారు. 
Chandrababu
YSRCP
woment wing
ananthapuram
saree
bangles
post

More Telugu News