Chandrababu: ఇతరుల వద్ద చేతులు చాచడం నాకు ఇష్టం ఉండదు: చంద్రబాబు

  • అమరావతిని మన సొంత డబ్బులతోనే కట్టుకుందాం
  • సింగపూర్ లో ఇప్పుడు నిపుణులైన తెలుగువారు కనపడుతున్నారు 
  • రాజధాని నిర్మాణానికి సహకరిస్తామన్న సింగపూర్ టీడీపీ ఫోరం
అమరావతి నిర్మాణం కోసం ఒకరి వద్ద చేతులు చాచడం తనకు ఇష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మన అమరావతిని మన సొంత డబ్బులతోనే నిర్మించుకుందామని ఆయన చెప్పారు. సింగపూర్ లో తెలుగువారితో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు వ్యాఖ్యానించారు. పాతికేళ్ల క్రితం తాను సింగపూర్ కు వచ్చినప్పుడు అంతా తమిళులే ఉండేవారని... ఇప్పుడు వివిధ రంగాల్లో నిపుణులైన తెలుగువారు కనపడుతున్నారని చెప్పారు.

విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి ప్రభుత్వం తరపున సహాయసహకారాలను అందించేందుకే 'ఏపీ ఎన్ఆర్టీ'ని స్థాపించామని చెప్పారు. ఎన్ఆర్టీ సేవలను అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగుదేశం ఫోరం సభ్యులు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణానికి బాండ్ల రూపంలో అండదండలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. 
Chandrababu
amaravathi
sigapore
Telugudesam forum

More Telugu News