mahaa news: టీవీ చర్చా వేదికలో నన్ను అవమానించారు!: సహనటి, టీవీ ఛానెల్ పై కేసు పెట్టిన మరో సినీ నటి

  • కాస్టింగ్ కౌచ్ పై చర్చ నిర్వహించిన టీవీ ఛానెల్
  • చర్చలో పాల్గొన్న రాఘశృతి, సునీత
  • పరస్పర ఆరోపణలు చేసుకున్న ఆర్టిస్టులు 
ఒక టీవీ ఛానెల్‌ చర్చావేదికలో తనను ముగ్గురు సహనటులు కించపరిచారని, ఆ చర్చా వేదికలో తనకు అవకాశం కల్పించలేదని టీవీ ఛానెల్ పై ఆరోపణలు చేస్తూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఒక సినీ నటి ఫిర్యాదు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులోని ఒక టీవీ ఛానెల్ సినీ పరిశ్రమలో నెలకొన్న కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంపై చర్చాకార్యక్రమం నిర్వహించింది.

ఇందులో రాఘశృతి, సునీత అనే ఆర్టిస్టులు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. రాఘశృతిది కూడా తన ఊరు కావడంతో ఆమెతో స్నేహం చేశానని, కొన్నాళ్లయ్యాక సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ, ఆమె తనతో చెడు పనులు చేయించేందుకు ప్రయత్నించిందంటూ సునీత ఆరోపించారు. అంతకుముందు ఆమె ఆ టీవీ ఛానెల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి, ఛానెల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఛానెల్ ఫిర్యాదుతో, పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో సునీత... రాఘశృతి, ఛానెల్ పై ఫిర్యాదు చేశారు.
mahaa news
tv channel
Hyderabad

More Telugu News