Karnataka: కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా?: అమిత్ షా

  • వచ్చే నెల 12న ఎన్నికలు
  • కర్ణాటకలో బీజేపీ గెలుపుపై అమిత్ షా ధీమా
  • సిద్ధ రామయ్య నియోజకవర్గ మార్పే తమ తొలి విజయమని వ్యాఖ్య
వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తన నియోజకవర్గాన్ని మార్చుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.

వచ్చే నెల 12న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీఎం సిద్ధ రామయ్య తాను ప్రస్తుతం ప్రతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కిత్తూరులో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ హవాను తట్టుకోలేకే సిద్ధ రామయ్య తన నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది తమ తొలి విజయమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదన్నారు.  
Karnataka
BJP
Amit shah
Congress

More Telugu News