Ramcharan: రామ్ చరణ్ సత్తా ఉన్న నటుడు .. ‘ఆస్కార్’ కు వెళ్లాల్సిన సినిమా ఇది!: పవన్ కల్యాణ్

  • ఇలాంటి గొప్ప సినిమాను ‘ఆస్కార్’కు పంపాలి
  • అలా చేయకపోతే ద్రోహం చేసిన వాళ్లమవుతాం
  • నాడు ‘బాహుబలి’ కోసం అందరూ అండగా నిలబడ్డారు
  • అలాగే, ‘రంగస్థలం’కు నిలబడాలి
హీరో రామ్ చరణ్ సత్తా ఉన్న నటుడని, ‘రంగస్థలం’ ఆస్కార్ అవార్డుల బరిలోకి వెళ్లాల్సిన సినిమా అని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్  అన్నారు. ‘రంగస్థలం’ విజయోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘దక్షిణ భారతం, ఉత్తర భారతం కలిసి ఒక లాబీగా ఏర్పడి ఇలాంటి గొప్ప సినిమాను ‘ఆస్కార్’కు షార్ట్ లిస్టు చేసి లాస్ ఏంజిల్స్ కు పంపించకపోతే ద్రోహం చేసిన వాళ్లమే అవుతాం. ముఖ్యంగా ప్రతిఒక్కరూ ఇలాంటి మంచి సినిమాను మనం అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తే దాని ప్రతిఫలం భారతదేశానికి ఉంటుంది.

భారతదేశం తరపున ‘ఆస్కార్’ పోటీలకు వెళ్లాల్సిన సినిమా ఇదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా నుంచి ఎలాంటి అండదండలు కావాలన్నా ఉంటాయి. ఇలాంటి గొప్ప కథను ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్ కు తెలుగుజాతి రుణపడి ఉంటుంది. రెండేళ్ల క్రితం బాహుబలి చిత్రం కోసం అందరూ ఎలా అయితే అండగా నిలబడ్డారో, ఈ రోజున రంగస్థలం చిత్రానికి కూడా అలాగే నిలబడాలి. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా అండగా నిలబడాలి. రాజకీయాల పరంగా వేర్వేరుగా ఉండొచ్చు కానీ, సినిమా పరంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ ఒక్కటే’ అని అన్నారు.
Ramcharan
Pawan Kalyan
ranghasthalam

More Telugu News