Road Accident: ఒడిశాలో ప్రమాదం.. వంతెన పైనుంచి కిందపడిన బస్సు

  • భువనేశ్వర్ నుంచి భవానీపట్నం వెళ్తున్న అభిలాష్ ట్రావెల్స్ బస్సు
  • అదుపు తప్పి 55 మంది ప్రయాణికులతో బ్రిడ్జి పై నుంచి కిందపడిన వైనం 
  • ఇద్దరు మృతి, మరో 34 మందికి గాయాలు
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. భువనేశ్వర్ నుంచి కలహండి జిల్లా భవానీపట్నం 55 మంది ప్రయాణికులతో బయల్దేరిన అభిలాష్ ట్రావెల్స్ బస్సు, భవానీపట్నం సమీపంలో నదిపైనున్న బ్రిడ్జ్ మీదుగా వెళ్తూ ఒక్కసారిగా కిందపడింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 34 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించగా, పోలీసులు, అధికారులు క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. 
Road Accident
odisha

More Telugu News