mi: గెలుపు ఊరించి దూరమైంది.. రెండు ఓటములు బాధపెట్టాయి: రోహిత్ శర్మ

  • బ్యాటింగ్ తీరు బాగాలేదు
  • స్కోరు బోర్డుపై మరిన్ని పరుగులు జోడించాల్సింది
  • బ్యాట్స్ మన్ విఫలమైనా బౌలర్లు ఆకట్టుకున్నారు
ఐపీఎల్ సీజన్‌-11లో రెండు వరుస ఓటములను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రెండు మ్యాచ్ లలోనూ గెలుపు ఊరించి దూరమైందని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటమిపై ఆయన మాట్లాడుతూ, కనీసం పోరాడే స్కోరును కూడా సాధించలేకపోయామని తమ బ్యాటింగ్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్కోరు బోర్డుపై మరిన్ని పరుగులు జోడించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్ మన్ వైఫల్యమే రెండు మ్యాచ్ లలో కొంపముంచిందని పేర్కొన్నాడు.

ఇంత నిరాశలో కూడా ఆశను రేకెత్తించే అంశమేంటంటే.. బౌలర్లు రాణించడమని చెప్పాడు. సాధారణ స్కోరును కూడా కాపాడేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమించి, ఆద్యంతం ఆకట్టుకున్నారని అభినందించాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఒక దశలో ఆటను తమ చేతుల్లోకి తీసుకున్నారని, చివర్లో దురదృష్టవశాత్తూ ఓటమిపాలయ్యామని పేర్కొన్నాడు. కాగా, ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.
mi
mumbai indians
sunraisers hyderabad
ipl

More Telugu News