nani: పారితోషికం పెరుగుదల గురించి నాని!
- సినిమా బిజినెస్ పైనే పారితోషికం ఆధారపడి ఉంటుంది
- వరుస సక్సెస్ లు ఎప్పుడూ రావు
- ఒక్కోసారి పారితోషికం తగ్గించవలసి ఉంటుంది
నాని ప్రతి మూడు నెలలకో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ .. వరుస విజయాలను సాధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాని తన పారితోషికాన్ని 9 కోట్లకి పెంచేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'కృష్ణార్జున యుద్ధం' సినిమా హిట్ కొడితే నాని పారితోషికం 10 కోట్లకి చేరిపోవడం ఖాయమనే కూడా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని నాని దగ్గర ప్రస్తావిస్తే,ఆయన తనదైన శైలిలో స్పందించారు.
ప్రత్యేకంగా తాను పారితోషికం పెంచడమంటూ జరగదనీ, తన సినిమా బిజినెస్ జరిగే రేంజ్ పై పారితోషికం ఆధారపడి ఉంటుందని అన్నాడు. ఒకవేళ ఏదైనా ఒక సినిమా ఆడకపోతే తరువాత సినిమాకి సహజంగానే పారితోషికం తగ్గిపోతుందని చెప్పాడు. ఎప్పుడూ సక్సెస్ లనే రాబట్టడం ఎవరివలన కాదనీ, అవి శాశ్వతమని తాను అనుకోనని అన్నాడు. తనకి పారితోషికం కన్నా ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.