Prakash Raj: దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూసి భయపడుతున్నాను: బెంగళూరులో ప్రకాశ్‌ రాజ్‌

  • ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ఆలోచించాలి
  • ఏ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవాలి
  • దేశంలో మార్పు కోరుకునే ప్రజలు కలిసి రావాలి
దేశంలో ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. ఈ రోజు బెంగళూరులో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి మాజీ ప్రధాని దేవేగౌడతో దేశ రాజకీయాలపై, కొత్త కూటమి ఏర్పాటుపై చర్చించిన అనంతరం ప్రకాశ్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు హామీలు ఇచ్చి మోసం చేశారో ఎవరు న్యాయం చేశారో ప్రజలు తెలుసుకోవాలని, ఏ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవాలని సూచించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూసి తాను భయపడుతున్నానని, ఇటువంటి సమయంలో దేశంలో మార్పు కోరుకునే ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.  
Prakash Raj
KCR
deve gouda

More Telugu News