hero jagpatibabu: హోదా ఉద్యమం అంశంపై అవసరమొచ్చినప్పుడు స్పందిస్తాం: హీరో జగపతిబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అవసరమొచ్చినప్పుడు స్పందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఈరోజు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో జగపతిబాబు మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ దూరంగా లేదని, అవసరమైనప్పుడు స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సినిమాల్లో తనకు ఎలాంటి పాత్రలొచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన జగపతిబాబు, పాత్ర కోసం అవసరమైతే గుండుతో నైనా నటిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు జగపతిబాబు స్పందిస్తూ, ఆ ఆలోచనకు తనకు లేదని, రాజకీయాల్లోకి తనను రమ్మనమని గతంలో కొందరు నేతలు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
Go Back to Shorts
hero jagpatibabu
politics

More Telugu News