Virat Kohli: తన ఫేవరేట్ హీరో ఎవరో చెప్పిన విరాట్‌ కోహ్లీ‌

  • బెంగళూరులో ఓ ప్రోగ్రామ్‌కి హాజరైన కోహ్లీ
  • ప్రశ్నలడిగిన అభిమానులు
  • సచిన్ టెండూల్కరే తన ఫేవరేట్ హీరో అని చెప్పిన విరాట్‌
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోహ్లీని తాజాగా అభిమానులు అడగగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కరే తన ఫేవరేట్ హీరో అని ఆయన స్వయంగా చెప్పాడు. తాజాగా బెంగళూరులో ఓ ప్రోగ్రామ్‌కి హాజరైన కోహ్లీని అభిమానులు ఈ ప్రశ్న అడిగారు. సినిమా హీరోల పేరు చెప్పకుండా సచిన్‌ అని ఎంతో వినయంగా కోహ్లీ సమాధానం చెప్పడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. కాగా, తాను వారాంతంలో సరదాగా గడిపేందుకు తనకు అవకాశం దొరికితే ఇంట్లో ఉండి రిలాక్స్‌ అవుతానని, లేకపోతే తన ఫేవరేట్‌ కారులో సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తానని అన్నాడు.
Virat Kohli
Sachin Tendulkar
Cricket

More Telugu News