akhil akkineni: ఆగలేనన్న అఖిల్.. ముందే చూసేద్దామన్న పూరీ జగన్నాథ్!

షార్ట్స్‌లో చూడండి
తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ 'మెహబూబా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జనాల్లోకి దూసుకుపోయింది. అద్భుతమైన విజువల్స్, యుద్ధ వాతావరణం, బుల్లెట్ల లాంటి డైలాగ్స్ సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో హీరో అక్కినేని అఖిల్ ఈ సినిమా ట్రైలర్ పై తన స్పందనను తెలియజేశాడు. 'వాట్ ఏ క్రాకింగ్ ట్రైలర్. నాకు బాగా నచ్చింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. వెయిట్ చేయలేకపోతున్నా. విజువల్స్ అదిరిపోయాయ్. మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్.' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు పూరీ జగన్నాథ్ రిప్లై ఇచ్చాడు. 'నీ స్పందనకు ప్రేమాభివందనాలు. రిలీజ్ కంటే ముందే మనిద్దరం కలిసి సినిమా చూద్దాం' అంటూ ట్వీట్ చేశాడు. 
Go Back to Shorts
akhil akkineni
Puri Jagannadh
mehbooba
tollywood

More Telugu News