Sri Reddy: చిరంజీవి గారూ... మీ పేరు చెప్పుకుని ఇతను ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు!: శ్రీరెడ్డి లీక్స్

  • పలువురి లైంగిక వేధింపులను బయట పెడుతున్న శ్రీరెడ్డి
  • వాకాడ అప్పారావు వందలాది మందిని వేధించాడు
  • అటువంటి వారిని ప్రోత్సహించకండి
  • చిరంజీవికి శ్రీరెడ్డి విజ్ఞప్తి
టాలీవుడ్ లో పలువురి లైంగిక వేధింపులను బయట పెట్టి సంచలనంగా మారిన శ్రీరెడ్డి ఎన్నో చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావును లక్ష్యంగా చేసుకుంది. వాకాడ అప్పారావు వందలాది మంది అమ్మాయిలను వాడుకున్నాడని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టింది. 16 సంవత్సరాల చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టలేదని ఆరోపించింది.

"మెగాస్టార్ చిరంజీవి గారూ... ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి" అని విజ్ఞప్తి చేసింది. తన ట్వీట్ కు వాకాడ అప్పారావు ఫొటోను జత చేసింది. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. 
Sri Reddy
Chiranjeevi
Tollywood
Vakada Apparao

More Telugu News