challa ramakrishna reddy: సీనియర్ నేత చల్లాను బుజ్జగిస్తున్న టీడీపీ

  • సముచిత స్థానం కల్పించడం లేదనే భావనలో చల్లా
  • మరో పదవి ఇచ్చే యోచనలో అధిష్ఠానం
  • చల్లాతో చర్చలు జరిపిన నేతలు
టీడీపీ సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి అలకపాన్పు ఎక్కారు. తనకు ఇచ్చిన కడప ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పదవిని తీసుకోబోనని ఆయన చెప్పారు. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో, కడప ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పదవి బదులు... మరో పదవిని ఆయనకు ఇచ్చేందుకు టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇదే విషయమై కొందరు నేతలు ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం టీటీడీ ఛైర్మన్ సహా పలు కార్పొరేషన్ పదవులను చంద్రబాబు భర్తీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, చల్లా మాట్లాడుతూ, తన ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. 
challa ramakrishna reddy
Telugudesam

More Telugu News