Tollywood: నలుగురైదుగురు వెళ్లి చంద్రబాబుకు మద్దతిస్తే సినీ ఇండస్ట్రీ అంతా ఇచ్చినట్టేనా?: పోసాని కృష్ణమురళి

  • హోదా విషయమై చంద్రబాబుకు సినీ ప్రముఖులు మద్దతిచ్చారు
  • మమ్మల్ని అడగలేదు
  • మొత్తం సినీ పరిశ్రమ తరపున ఎలా మద్దతు ఇస్తారు?
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై సీఎం చంద్రబాబుకు మద్దతిస్తున్నామని తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళ్లిన నలుగురైదుగురు చెబితే చాలా? అని ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొత్తం సినీ పరిశ్రమ తరపున చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి వీళ్లెవరంటూ ప్రశ్నించారు.

సినీ ప్రముఖులు అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, కే ఎల్ నారాయణ, వెంకటేశ్వరరావు, కిరణ్ తదితరులు చంద్రబాబును కలిసి సినీ ఇండస్ట్రీ నుంచి సంపూర్ణ మద్దతు ఉందంటూ ప్రకటన చేశారని, ఈ విషయం ఓ వార్తా పత్రికలో వచ్చిందని అన్నారు. ఒకవేళ ఆ పత్రిక అబద్ధం రాసి ఉంటే ఆ వార్తను వీళ్లు ఖండించాలని, సినీ పరిశ్రమ తరపున కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబును కలిసి తమ మద్దతు ప్రకటించామని చెప్పాలని అన్నారు.

‘సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబు హోదా ఉద్యమానికి  మద్దతుగా ఉంటుందని వారు చెప్పారు. కానీ నేను మాత్రం మద్దతు ఇవ్వడం లేదు. మమ్మల్ని అడగకుండా మొత్తం సినీ పరిశ్రమ తరపున ఎలా మద్దతు ఇస్తారు? ఇండస్ట్రీ అంటే ఆ ఐదుగురేనా?’ అని ప్రశ్నించారు.
Tollywood
Posani Krishna Murali
Chandrababu

More Telugu News