ram gopal varma: వందేళ్ల సినిమా చరిత్రలో శ్రీరెడ్డిలా ఎవరూ పోరాటం చేయలేదు : రామ్ గోపాల్ వర్మ

  • శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి నా సెల్యూట్
  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరినీ మేల్కొలిపింది
  • వరుస ట్వీట్లు చేసిన దర్శకుడు వర్మ
నటి శ్రీరెడ్డి అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. వందేళ్ల సినిమా చరిత్రలో నటి శ్రీరెడ్డిలా ఎవరూ పోరాటం చేయలేదని కితాబిచ్చారు. ఈ మేరకు వర్మ వరుస ట్వీట్లు చేశారు. గత వందేళ్లలో క్యాస్టింగ్ కౌచ్ పై దుర్మార్గాలను ఎవరూ వెలుగులోకి తీసుకురానంతగా శ్రీరెడ్డి తీసుకొచ్చిందని, ఆమె చేస్తున్న పోరాటానికి తన సెల్యూట్ అని ప్రశంసించారు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి ఆమె తల్లి గర్వపడాలని పేర్కొన్నారు. శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన విధానం తప్పే అని అభిప్రాయపడుతున్న వారు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరినీ మేల్కొలిపిన విషయాన్ని గుర్తించాలని సూచించారు.
ram gopal varma
Tollywood

More Telugu News