Chandrababu: కాసేపట్లో హైదరాబాద్‌ మీదుగా సింగపూర్‌ వెళ్లనున్న చంద్రబాబు

  • సింగపూర్‌లో ఒక్కరోజు పర్యటన
  • ఆసియా లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న చంద్రబాబు
  • వాణిజ్య, పారిశ్రామిక సంస్థల సీఈవోలతో చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు బయలుదేరారు. ఇందుకోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌ కు బయలుదేరిన చందబ్రాబు.. అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లనున్నారు. సింగపూర్‌లో జరిగే హిందూస్థాన్‌ టైమ్స్‌-మింట్‌ ఆసియా లీడర్‌షిప్‌ సమ్మిట్‌-2018లో ఆయన పాల్గొంటారు.

రేపు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల సీఈవోలతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఇక రేపు రాత్రి సింగపూర్‌ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెట్టి ఎల్లుండి ఉదయం చంద్రబాబు విశాఖపట్నానికి చేరుకుని అక్కడి నుంచి అమరావతికి వస్తారు.
Chandrababu
Andhra Pradesh
singapore

More Telugu News