jagan: మోదీ నిరాహారదీక్షపై జగన్ ట్వీట్!

  • మీరు ఈ రోజు నిరాహారదీక్ష చేపట్టారు
  • ఏపీ ఎంపీలు ఆరు రోజులపాటు దీక్ష చేశారు
  • ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి
పార్లమెంటు సమావేశాలు సక్రమంగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్న తీరును నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క రోజు నిరాహారదీక్షను ఈ రోజు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు.

'నరేంద్ర మోదీగారు... మీరు ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా... 6 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన ఐదుగురు ఏపీ ఎంపీలు ఆసుపత్రిలో ఉన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకలను దయచేసి వినండి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి' అంటూ ట్వీట్ చేశారు.
jagan
Narendra Modi
special status
hunger strike
tweet

More Telugu News