bjp: చంద్రబాబు మద్దతు వల్లే బీజేపీపై దాడులు జరుగుతున్నాయి!: ఎంపీ హరిబాబు

  • బీజేపీ కార్యకర్తలపై సీపీఐ దాడిని ఖండించిన హరిబాబు
  • ఈ దాడి అప్రజాస్వామికం
  • పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు..దాడిని అడ్డుకోలేకపోయారు
విజయవాడలో బీజేపీ నేతలపై సీపీఐ కార్యకర్తలు చెప్పులతో దాడి చేసిన సంఘటనపై ఎంపీ హరిబాబు మండిపడ్డారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీపై జరిగిన దాడి అప్రజాస్వామికమని, కమ్యూనిస్టుల ఫాసిస్ట్ ఆలోచనలకు నిదర్శనమని అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మద్దతు తెలపడం వల్లే తమ పార్టీపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.

తమ కార్యకర్తలపై సీపీఐ కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, కమ్యూనిస్టుల దాడిని అడ్డుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చోద్యం చూడమని చంద్రబాబు నుంచి ఆదేశాలు అందాయేమో' అంటూ మండిపడ్డారు. ఇలాంటివి చాలా చూశామని, ఎదుర్కొనే శక్తి తమకు ఉందని,  ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంపై మరో రాజకీయ పార్టీ దాడిచేయడం సంస్కృతిగా మారిందని విమర్శించారు.
bjp
mp hari babu

More Telugu News