Prakasam District: ఒంగోలులో విషాదం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి

  • నలుగురు చిన్నారులు ఆడుకుంటుండగా సంఘటన
  • నిర్మాణంలో ఉన్న గోడ కూలి వీరిపై పడిన వైనం  
  • అక్కడికక్కడే మృతి చెందిన ఎనిమిదేళ్ల నవదీప్  
  • ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. స్థానిక మంగమూరు రోడ్డులోని కొత్తడొంకలో గుడిమెట్ల నవదీప్ (8), కట్టామణి (8), సింధే ప్రేమచంద్ (9), అతని సోదరి సింధే ప్రేమ్ జ్యోతి ఈరోజు పాఠశాలకు వెళ్లి తిరిగి తమ ఇళ్లకు వచ్చారు. తమ ఇళ్లకు సమీపంలో వీరంతా కలిసి ఆడుకుంటున్న సమయంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి వీరిపై పడింది.

ఈ ప్రమాదంలో నవదీప్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మణి, ప్రేమ్ చంద్ ప్రాణాలు విడిచారు. ప్రేమ్ జ్యోతికి మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Prakasam District
ongole

More Telugu News