Arvind Kejriwal: మోదీ తనపై తానే దీక్షకు దిగారు: కేజ్రీవాల్ ట్వీట్ సెటైర్

  • పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగనివ్వలేదని మోదీ ఒక్కరోజు దీక్ష
  • మోదీ దీక్షను ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ
  • మోదీ దీక్షపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేజ్రీవాల్
పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు సజావుగా సాగనివ్వలేదని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క రోజు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వివిధ పార్టీలకు చెందిన నేతలు వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఉన్నావో అత్యాచారానికి వ్యతిరేకంగా కూడా ప్రధాని దీక్ష చేస్తారని ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ ఎద్దేవా చేయగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్ లో ప్రధాని దీక్షపై స్పందిస్తూ, ‘ఇది చాలా బాగుంది. కేవలం ఒక్క రోజు నిరాహార దీక్ష. అది కూడా తనపై తానే దీక్షకు దిగుతున్నారు’ అంటూ ట్విట్టర్ మాధ్యమంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
Arvind Kejriwal
Rahul Gandhi
Narendra Modi

More Telugu News