kadapa: చంద్రబాబుపై చల్లా రామకృష్ణారెడ్డి అలక... కార్యకర్తలతో అత్యవసర సమావేశం!

షార్ట్స్‌లో చూడండి
తాను ఎంతో సీనియర్ నేతనైనప్పటికీ, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఓ చిన్న పదవిని మాత్రమే ఇచ్చారన్న మనస్తాపంతో, రెండు రోజుల క్రితం చంద్రబాబు ఆఫర్ చేసిన కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవిని తిరస్కరిస్తున్నట్టు చల్లా రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, కార్పొరేషన్ పదవులు పొందిన వారిలో అత్యధికులు తనకన్నా జూనియర్లని వెల్లడించిన ఆయన, చిన్న పదవితో తనను అవమానించారని అన్నారు.

టీడీపీకి తానెంతో చేశానని, తన సేవలను మరచిపోయారని వ్యాఖ్యానించిన ఆయన, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, వారితో చర్చిస్తానని, ఆపై వారి అభీష్టం మేరకు ఓ నిర్ణయం తీసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులు ఏం చెబితే అది చేయడానికి సిద్ధమని అన్నారు. కాగా, వైఎస్ బతికున్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చల్లా, ఆపై టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
kadapa
RTC Chairman
Chandrababu
Challa Ramakrishna reddy

More Telugu News