మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ యువకుడి ఆత్మహత్య
- డిఫెన్స్ ఎక్స్ పోలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న ప్రధాని
- నిరసనగా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ధర్మలింగం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఆయన పర్యటనను నిరసిస్తూ, కావేరీ జలవివాదంపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఈరోడ్ కు చెందిన ధర్మలింగం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విషయం తన ఇంటి గోడపై రాసి నేటి ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో ఆహుతవుతున్న ధర్మలింగాన్ని చూసిన ఇరుగుపొరుగువారు మంటలార్పి ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. దీంతో తమిళనాట ఆందోళనలు మిన్నంటాయి.