Prime Minister: మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ యువకుడి ఆత్మహత్య

  • డిఫెన్స్ ఎక్స్ పోలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న ప్రధాని
  • నిరసనగా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ధర్మలింగం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కావేరీ జలవివాదం నేపథ్యంలో గత కొంత కాలంగా తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిఫెన్స్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చెన్నై చేరుకున్నారు.

ఆయన పర్యటనను నిరసిస్తూ, కావేరీ జలవివాదంపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఈరోడ్ కు చెందిన ధర్మలింగం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విషయం తన ఇంటి గోడపై రాసి నేటి ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో ఆహుతవుతున్న ధర్మలింగాన్ని చూసిన ఇరుగుపొరుగువారు మంటలార్పి ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. దీంతో తమిళనాట ఆందోళనలు మిన్నంటాయి.
Prime Minister
Narendra Modi
Tamilnadu
sucide
kavery controversy

More Telugu News