'ఆమ్రపాలి' సంస్థపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ధోనీ, భువీ, రాహుల్, డుప్లెసిస్
- ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాడర్ గా పని చేసిన ధోనీ, కేఎల్ రాహుల్, డుప్లెసిస్
- క్రికెటర్లకు బ్రాండింగ్, మార్కెటింగ్ డబ్బులు చెల్లించని సంస్థ
- 200 కోట్ల రూపాయల మేర క్రికెటర్లకు బాకీ
ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థ క్రికెటర్లకు 200 కోట్ల రూపాయల మేర బకాయిలు పడిందని రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. కాగా, ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వివిధ పట్టణాల్లో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతోంది. దీంతో పలువురు వినియోగదారులు ఈ సంస్థను దుమ్మెత్తిపోస్తూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు వినియోగదారులు ధోనీని ట్యాగ్ చేస్తూ పలు ట్వీట్లు చేశారు. దీంతో 2016లో ధోనీ ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.