Nara Lokesh: పార్లమెంటులో వాళ్లు పిల్లిలా ఉంటారు: మంత్రి నారా లోకేశ్‌

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని కేంద్ర ప్రభుత్వం మొదట చెప్పిందని, కానీ మాట తప్పిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ రోజు ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఏపీని పట్టించుకోలేదని, ఇప్పుడు బీజేపీ, వైసీపీలు కలిసి కుట్ర రాజకీయాలు మొదలు పెట్టాయని అన్నారు. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో పిల్లిలా ఉంటారని, వారు కేసుల మాఫీ కోసమే అలా ఉంటున్నారని, ఏమీ పోరాడడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని ఆవేశంగా మాట్లాడుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చేసిన వారు అసూయపడేలా రాజధానిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Nara Lokesh
YSRCP
Telugudesam

More Telugu News