Narendra Modi: అందుకు కూడా త్వరలో మోదీ దీక్ష చేయాలి: రాహుల్ గాంధీ వ్యంగ్య వీడియో

  • దీక్షకు సిద్ధమైన మోదీ
  • బీజేపీ పాలనలో మహిళలపై దాడులు జరుగుతున్నాయన్న రాహుల్‌ 
  • దేశంలో శాంతి భద్రతల సమస్య ఉందని ట్వీట్
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెందానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరోజు నిరాహార దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. మోదీ దీక్షపై ప్రతిపక్ష పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ దీక్షను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో తన కూతురికి న్యాయం చేయమంటూ వేడుకున్న ఓ తండ్రిపై దాడి చేశారని తెలుపుతూ అందుకు సంబంధించిన వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు. ఈ ఘటన ద్వారా మానవత్వం తలదించుకునేలా చేశారని, బీజేపీ పాలనలో మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతున్నందుకు మోదీ త్వరలోనే దీక్ష చేస్తారని ఆశిస్తున్నానని చురకలంటించారు. 
Narendra Modi
Rahul Gandhi
Congress

More Telugu News