ఓయూకి వెళ్లిన శ్రీరెడ్డి.. మద్దతు ప్రకటించిన విద్యార్థి సంఘాలు
- శ్రీరెడ్డికి ఓయూ జేఏసీ మద్దతు
- 'మా' వ్యవస్థ కొన్ని కుటుంబాలకే పరిమితమైందని విమర్శలు
- వారికే అవకాశాలు ఇస్తోందని ఆరోపణలు
శ్రీరెడ్డి నిరసన వెనుక ఉన్న ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు అన్నారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) వ్యవస్థ కొన్ని కుటుంబాలు, కులాలకే పరిమితమవుతోందని, వారికే అవకాశాలు ఇస్తోందని ఆరోపించారు. ఈ తీరు ఇలాగే కొనసాగితే ఓయూ జేఏసీ అంతా కలిసి 'మా' ఆఫీసుని ముట్టడిస్తుందని హెచ్చరించారు. 'మా' చర్య దుర్మార్గంగా ఉందని, శ్రీరెడ్డికి అన్యాయం చేసిందని అన్నారు.
ఈ సందర్భంగా శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓ ఆడపిల్ల ఏడిస్తే ఎవ్వరూ చేతులు కట్టుకుని ఉండరని ఓయూ విద్యార్థులు నిరూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. తనను ఓ చెల్లిలా భావించి ఓయూ విద్యార్థులు తన కష్టాల గురించి తెలుసుకున్నారని తెలిపింది. ఇండస్ట్రీలో తనలాంటి అన్యాయం చాలా మందికి జరిగిందని చెప్పింది.