Chinthamaneni Prabhakar: ఒకరితో కాపురం చేస్తుంటే... నేను కూడా కాపురం చేస్తా అని అడగడానికి సిగ్గుందా?: జగన్ పై చింతమనేని ఫైర్
- వైసీపీ, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉంది
- దమ్ముంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలి
- టీ అమ్ముతూ వినూత్నంగా నిరసన చేపట్టిన చింతమనేని
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చాయ్ పే చర్చా తమకు వద్దని, ప్రత్యేక హోదానే ముద్దు అంటూ పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ టోల్ గేటు వద్ద చాయ్ అమ్మారు. ఆంధ్ర టీ తాగండి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, వైసీపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావాలి, కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలనే రహస్య ఒప్పందం ఈ రెండు పార్టీలకు ఉందని... ఈ విషయాన్ని బయటపెట్టాలని ఈ సందర్భంగా చింతమనేని డిమాండ్ చేశారు. దమ్ముంటే రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి చెబుతామని తెలిపారు.
ఇంటింటికీ తెలుగుదేశం మాదిరి ఇంటింటికీ మీ అపవిత్ర కలయిక, రహస్య ఒప్పందాలు, దుర్బుద్ధి రాజకీయాలను ప్రచారం చేస్తామని చెప్పారు. ఒక పార్టీతో సంసారం చేస్తుంటే, మేము కూడా వచ్చి కాపురం చేస్తామంటూ అడగడానికి సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? అంటూ తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. ఒకరితో కాపురం చేస్తుంటే, నేను కూడా వచ్చి కాపురం చేస్తానని అడగడం ఎంతవరకు కరెక్ట్? అని మండిపడ్డారు. జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చెప్పారు.