ajay ghosh: విలనిజం అంటే ఇష్టం .. వాళ్ల నీడలో నిలబడే చోటు దొరికినా చాలు: నటుడు అజయ్ ఘోష్

  • విలన్ పాత్రలు చేయడం ఇష్టం
  • ఆ తరహా వ్యక్తులను పరిశీలిస్తాను 
  • అవకాశం వచ్చినప్పుడు స్ఫూర్తిని పొందుతాను        
పెద్ద పెద్ద కళ్లతో .. నున్నని గుండుతో .. భారీ పర్సనాలిటీతో తెరపై అజయ్ ఘోష్ కనిపిస్తుంటారు. సినిమాల్లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తూ ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'రంగస్థలం'లో వేసిన పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి అజయ్ ఘోష్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.

" నాకు విలన్ పాత్రలు చేయడం ఇష్టం .. విలనిజంలోను ఎన్నో విభిన్నమైన లక్షణాలు ఉంటాయి. అందువల్లనే సమాజంలోని వివిధ రకాల మనుషులను చాలా దగ్గరగా పరిశీలిస్తూ వుంటాను. ఆయా వ్యక్తులు .. వాళ్ల చిత్రమైన ధోరణి నుంచి విలన్ గా నా నటనకి కావలసిన కంటెంట్ ను తీసుకుంటాను. విలన్ పాత్రలకి సంబంధించి నేను స్ఫూర్తిని పొందడానికి ఎస్వీఆర్ నుంచి కోట శ్రీనివాసరావు గారు వరకూ కారకులే. అలాంటి మహానటుల నీడలో నిలబడే చోటు దొరికినా చాలనేది నా కోరిక" అంటూ చెప్పుకొచ్చారు.        
ajay ghosh

More Telugu News