roja: 'ఇలాంటి వారిని ఏమనాలి?'.. వెంకయ్య నాయుడిపై రోజా తీవ్ర విమర్శలు

  • వెంకయ్య తెలుగు గడ్డ మీద పుట్టారు
  • ఆయన నెల్లూరు వాసి
  • ఆనాడు పదేళ్లు హోదా కావాలన్నారు
  • మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగపడే రాజధానిని నిర్మించకుండా ఆ భూముల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం పోరాడుతోందని చెప్పారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... 'ఎంత బాధాకరమైన విషయమంటే వెంకయ్య నాయుడు తెలుగు గడ్డ మీద పుట్టిన నెల్లూరు వాసి. ఆనాడు ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్య నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చాక తన బీజేపీ, తన మిత్ర పక్షం టీడీపీ ప్రత్యేక హోదాపై ప్రజలను మభ్య పెడుతుంటే ఎందుకు మాట్లాడలేదు? తెలుగు బిడ్డ అయిన వెంకయ్య నాయుడు మోదీని ఎందుకు ప్రశ్నించలేదు? అని ప్రశ్నించారు.

'వెంకయ్య నాయుడికి నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ఓపెనింగ్‌కి వెళ్లడానికి సమయం ఉంటుంది. ప్రజలకు అవసరం లేని, అసత్యాలతో నిండిన ఆనందనగరి కార్యక్రమానికి రావడానికి సమయం ఉంటుంది. కానీ, ఆనాడు రాజ్యసభలో హోదా గురించి ప్రశ్నించిన విషయాన్ని గురించి మాట్లాడడానికి మాత్రం సమయం ఉండదు. ఇలాంటి వారిని ఏమనాలి?' అని రోజా విమర్శించారు.
roja
Chandrababu
Venkaiah Naidu

More Telugu News