Kareena Kapoor: కరీనా కపూర్ తన కుమారుడు ఏమి కావాలని కోరుకుంటోందో తెలుసా?

  • తైమూరే అతని కెరీర్ ను నిర్ణయించుకుంటాడన్న కరీనా
  • మంచి క్రికెటర్ అయితే చూడాలని ఉందన్న అగ్ర నటి
  • తైమూర్ తాత పటౌడీ లెజెండరీ క్రికెటర్
బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ల ముద్దుల కుమారుడు తైమూర్ పుట్టినప్పటి నుంచి వార్తల్లోనే ఉంటున్నాడు. అతనికి సంబంధించిన ప్రతి ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ అవార్డ్స్ ఫంక్షన్ కు కరీనా హాజరైంది. ఆ సందర్భంగా తైమూర్ కు సంబంధించిన ప్రశ్నలను మీడియా ప్రతినిధులు ఆమెకు సంధించారు.

తైమూర్ ఏమి కావాలని మీరు కోరుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా... తైమూర్ ఏ కెరీర్ ను ఎంచుకోవాలనే దానిపై తనకు స్పష్టమైన అభిప్రాయం లేదని చెప్పింది. తన కెరీర్ ను తైమూరే నిర్ణయించుకుంటాడని తెలిపింది. దీనిపై మరింత లోతుగా ప్రశ్నిస్తే... తైమూర్ ను మంచి క్రికెటర్ గా చూడాలనుకుంటున్నానని సమాధానమిచ్చింది. తైమూర్ తాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక లెజెండరీ క్రికెటర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.
Kareena Kapoor
Saif Ali Khan
Taimur
career
cricketer
Mansoor Ali Khan Pataudi

More Telugu News