Tollywood: మహిళ ఓ వస్తువే... పాతికేళ్ల నాడే విమలక్క చెప్పింది: నటి మాధవీ లత

  • కాస్టింగ్ కౌచ్ పై మాధవీ లత స్పందన
  • 'దిగంబరుల ఊరేగింపు'ను గుర్తు చేసిన మాధవి
  • గతంలోనూ లైంగిక వేధింపులపై గళమెత్తిన నటి
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై మరో నటి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. 'నచ్చావులే', 'స్నేహితుడా' తదితర చిత్రాల ఫేమ్ మాధవీ లత కొద్దిసేపటి క్రితం తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెడుతూ మహిళ ఒక వస్తువేనని చెప్పింది. ఈ విషయాన్ని పాతికేళ్ల క్రితమే విమలక్క తన రచనల్లో చెప్పిందని గుర్తు చేస్తూ, 'దిగంబరుల ఊరేగింపు' పేరిట విమల రాసిన ఓ కవితను పోస్టు చేసింది. కాగా, గతంలోనూ మాధవీ లత మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై గళమెత్తిన సంగతి తెలిసిందే. తాను కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆమె గతంలో వ్యాఖ్యానించింది.
Tollywood
Casting Couch
Madhavi Latha

More Telugu News