vishnu kumar raju: బీజేపీకి గుడ్ బై చెప్పడంపై విష్ణుకుమార్ రాజు స్పందన

  • నాకు అలాంటి ఆలోచన లేదు
  • ఎన్నికలకు చాలా సమయం ఉంది
  • అంత దూరం ఆలోచించడం లేదు
ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా విష్ణు స్పందించారు. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే... మళ్లీ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని... ఈ నేపథ్యంలో, తాను అంత దూరం ఆలోచన చేయడం లేదని చెప్పారు. మరోవైపు, జనసేనతో కానీ, వైసీపీతో కానీ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదని అన్నారు. 
vishnu kumar raju
BJP
party change
Jana Sena
YSRCP

More Telugu News