Tirumala: తిరుమల వెంకన్నే ఈ అవకాశం ఇచ్చాడు: పుట్టా సుధాకర్ యాదవ్

  • తిరుమలలో అన్యమత ప్రచారం జరగనివ్వను
  • సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా నిర్ణయాలు
  • టీటీడీ కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరుగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యానించారు. నిన్న టీటీడీ చైర్మన్ గా నియమించబడ్డ ఆయన, ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే దేవస్థానంలో ఉన్న అన్యమత ఉద్యోగులకు అన్యాయం జరుగకుండా సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.

తనకు సేవ చేసుకునే అవకాశాన్ని వెంకటేశ్వర స్వామే ఇచ్చాడని చెప్పిన పుట్టా, సామాన్యులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేలా పాలకమండలి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. తానూ ఓ సామాన్యునిలా స్వామి సేవ చేసుకుంటానని, టీటీడీ చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబునాయుడికి రుణపడి ఉంటానని అన్నారు.
Tirumala
Tirupati
TTD
Putta Sudhakar Yadav

More Telugu News