రైలు ప్రమాదం కాదు... ప్రియుడి కోసం భర్తను హత్య చేయించింది!
- బోరబండ సమీపంలో ఫిబ్రవరి 21న మృతదేహం
- తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు
- విచారణలో తేలిన నిజం
తమ ఇంటికి సమీపంలో ఉండే మహ్మద్ తబ్రేజ్ ఖురేషితో పరిచయం పెంచుకున్న సలేహా, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఈ విషయంలో ఖాజా పలుమార్లు తన భార్యను మందలించాడని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక ఎలాగైనా భర్తను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ప్రియుడితో కలసి ఆమె ఓ పథకాన్ని రూపొందించిందని, అందులో భాగంగా రూ. 2 లక్షలు ఇస్తానని చెబుతూ తబ్రేజ్ ఖురేషీ ముగ్గురితో సుపారీ కుదుర్చుకున్నాడని వెల్లడించారు.
వీరంతా కలసి ఖాజాను తీసుకెళ్లారని, రైలు పట్టాల సమీపంలో మద్యం తాగించి, ఆపై బండరాళ్లతో మోది చంపారని, మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారని తెలిపారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేశామని తెలిపారు. భర్త ఇంటి నుంచి వెళ్లిన గంటల వ్యవధిలోనే సలేహా పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ మరుసటి రోజే అతని మృతదేహం కనిపించడంతో తమకు వచ్చిన అనుమానమే కేసును ఛేదించేందుకు సహాయపడిందని అన్నారు.