Chandrababu: మరో విదేశీ పర్యటనకు రెడీ... రేపు సింగపూర్ కు చంద్రబాబు

  • గురువారం సింగపూర్ కు వెళ్లనున్న చంద్రబాబు బృందం
  • హిందుస్థాన్ టైమ్స్ - మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ - 2018 కోసమే
  • పెట్టుబడులపై చర్చించనున్న ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపటి నుంచి సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. 13న అక్కడ జరిగే హిందుస్థాన్ టైమ్స్ - మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ - 2018లో చంద్రబాబు బృందం పాల్గొననుంది. ఈ సదస్సులో భాగంగా పలువురు ప్రముఖ వ్యాపారులను, వాణిజ్యవేత్తలను, పారిశ్రామిక సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతోనూ చంద్రబాబు సమావేశం అవుతారు.

వారితో రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చించనున్నారు. ఏపీలో అమలవుతున్న పారిశ్రామిక విధానంపై వారికి చంద్రబాబు బృందం వివరించి చెప్పనుంది. ఆపై 14వ తేదీ శనివారం నాడు చంద్రబాబు తిరిగి ఇండియాకు బయలుదేరుతారు. కాగా, చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, అధికారులు వెళుతున్నారు.
Chandrababu
Andhra Pradesh
Singapore

More Telugu News