Karnataka: కర్ణాటక ఎన్నికల బరిలో సినీ నటి సుమలత!

  • అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అంబరీష్
  • ఆయన స్థానంలో సుమలతకు టికెట్ కేటాయింపు
  • అంబరీష్‌ వైపే మొగ్గు చూపుతున్న సిద్ధ రామయ్య
వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగనున్నారు. ఆమెకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. సుమలత భర్త అంబరీష్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఆయనకు టికెట్ కేటాయింపు అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలోనే సుమలతకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ నుంచి ఇప్పటికే సంకేతాలు అందినట్టు చెబుతున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాత్రం అంబరీష్‌కు టికెట్ ఇవ్వడమే కరెక్టని భావిస్తున్నారు. లేదంటే ఆ ప్రభావం మైసూరు జిల్లాపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసిన అంబరీష్ తనకు బదులుగా తన భార్య సుమలతకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం అంగీకరించినట్టు చెబుతున్నారు.
Karnataka
Sumalatha
Ambareesh
Elections

More Telugu News